calender_icon.png 26 November, 2024 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాలను సద్వినియోగించుకోవాలి

26-11-2024 05:07:28 PM

చేగుంట: ప్రభుత్వము ఉపాధి హామీ పథకం ద్వారా అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని గ్రామ పంచాయతీ సెక్రటరీ రాధా పేర్కొన్నారు.  ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమంను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఉపాధి హామీ  పథకంలో భాగంగా ప్రభుత్వము ఐదు నెలల యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తున్నదని అందులో భాగంగా పశువుల షెడ్లు, కోళ్ల ఫారం షెడ్లు, నీటి తొట్లు (అజోల్ల), వర్మి కంపోస్టు, నాడెప్ కంపోస్ట్, ఇంకుడు గుంతల నిర్మాణం, అంగన్వాడి భవన నిర్మాణము, పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం, చెక్ డ్యాముల నిర్మాణం, మెటల్ రోడ్డు నిర్మాణము, ఫారం ఫండ్స్, వర్షపు నిల్వ నీటి తొట్లు, వంటి పనులు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. అర్హులైన రైతులు, ప్రజలు ఉపాధి పనులను సద్వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అనంతరం గ్రామానికి చెందిన ఎరుకల రాజుకు మంజూరైన ఇంకుడుగుంత పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ బుడ్డ ప్రదీప్, సి ఏ స్వామి, తదితరులు పాల్గొన్నారు.