25-04-2025 07:25:04 PM
దౌల్తాబాద్ (విజయక్రాంతి): వేసవి సెలవుల్లో విద్యార్థుల ప్రతిభను మరింత పెంచేందుకు పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు(Mandal Education Officer Gajjela Kanakaraju) అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ బాలుర ఉన్నత పాఠశాల, గాజులపల్లి ప్రాథమిక పాఠశాలలో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు విద్యతో పాటు పాటలు, యోగ, చిత్రలేఖనం, నృత్యం, గానం, మెడిటేషన్ పై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యార్థులు శిబిరానికి హాజరై నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి, కృష్ణ, విష్ణు, రాజు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.