13-02-2025 12:00:00 AM
గజ్వేల్, ఫిబ్రవరి12: కంది రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్ వెస్లీ సూచించారు. బుధవారం గజ్వేల్ వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పిఎసిఎస్ ద్వారా కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏఏంసి కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో పాటు, జిల్లాలోని కంది పంట సాగు చేసిన రైతుల పంట కొనుగోళ్ల కోసం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో రైతులు కందులను విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ. 7,550 పొందాలని సూచించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ సీఈవో బాలయ్య, మండల వ్యవసాయ అధికారి నాగరాజు, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.