ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
మంచిర్యాల, నవంబర్ 16 (విజయక్రాంతి): నూతనంగా గృహాలు నిర్మించుకునే వారు హాజీపూర్ మండలం ముల్కల్‌లో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల ఎమ్మె ల్యే ప్రేంసాగర్‌రావు సూచించారు. శనివారం జిల్లా మైనింగ్ అధికారి వాగేటి జగన్మోహన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లుతో కలిసి ఇసుక రీచ్‌ను, ఇసుక వాహనాలను ప్రారంభించారు.
అనంతరం పట్టణంలోని కాలేజీ రోడ్డులోని మెడికల్ కళాశాలలో క్రిటికల్ కేర్ బ్లాక్ సెంటర్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ ఆసుపత్రిని ర్మాణం చేపడుతున్నామని, మంచిర్యాల ప్రజలకు ఉన్నత మైన వైద్యం అందతుందన్నారు. త్వరలో మంచిర్యాల మెడికల్ హబ్‌గా మారుతుందన్నారు. కార్యక్రమంలో డీఎంఅండ్ హెచ్‌వో హరీష్‌రాజ్, జిల్లా ఆసుప త్రి సూపరింటెండెంట్ హరీశ్చంద్ర, కాలేజీ ప్రిన్సిపాల్ దావూ ద్ షులేమాన్ పాల్గొన్నారు.