10-04-2025 02:13:56 AM
నాగారం, ఏప్రిల్ 9: రాజీవ్ యువ వికాసం పథకమును సద్వినియోగ పరుచు కోవాలని ఎంపీడీవో మారయ్య అన్నారు. బుధవారం నాగారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లా డుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారులు ఆన్లైన్లో నమోదు చేసుకున్న వివరాలతో పాటు జిరాక్స్ కాపీలను జత చేసి ఇవ్వాలని కార్యాలయంలో దరఖాస్తు లను తప్పనిసరిగా విధిగా అందచేయలన్నారు.
ఆన్లైన్లో నమోదు చేసుకొని దరఖా స్తులు ఇవ్వనివారు వెంటనే కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు. ఈనెల 14 వరకు చివరి రోజు కావున లబ్ధిదారులు గడువు తేదీలోపు ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు. మొత్తం మండలంలో 1127 దరఖా స్తు చేసుకోగా 563 దరఖాస్దారులు మాత్ర మే పత్రాలను అందజేశారని తెలిపారు. ఆయన వెంట సూపర్డెంట్ ముత్తయ్య జూనియర్ అసిస్టెంట్లు వెంకన్న, అక్తర్ జానీమియా కార్యాలయ సిబ్బంది ఉన్నారు.