calender_icon.png 17 April, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

05-04-2025 12:53:45 AM

  • 40 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి 
  • రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి, ఏప్రిల్4 (విజయక్రాంతి) : నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూత నంగా తెచ్చిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియో గం చేసుకోవాలని రాష్ట్ర ఆబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గం లోని పానగల్ మండలంలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

మండలంలోని అర్హులైన 40 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికా సం పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు. 

ఆయా వర్గాల జనాభా ప్రాతిపదికన జిల్లాలు, మున్సిపాలిటీలు, మండలాలకు యూనిట్లు కేటాయిస్తారనీ రూ.50 వేల వరకు ఖర్చయ్యే యూనిట్లకు ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. రూ.50వేల నుంచి రూ.లక్ష వ్యయంతో కూడిన ప్రాజెక్టులకు 90 శాతం సబ్సిడీ 10 శాతం బ్యాంకు రుణం ఉంటుందనీ, రెండు లక్షల వరకు 80 శాతం, 4 లక్షల వరకు ఉన్న యూనిట్లకు 70 శాతం సబ్సిడీ ఇచ్చి మిగిలిన 30 శాతం బ్యాంకు రుణాల ద్వారా గ్రౌండింగ్ చేయడం జరుగుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమ ణ్యం, తహసిల్దార్ సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీఓ గోవింద రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, ఇతర ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.