04-04-2025 12:00:00 AM
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి):రాజీవ్ యువవికాస్ పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాం గ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మంకాల శేఖర్ రెడ్డి అన్నారు. యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువవికాస్ పథకం దరఖాస్తు గడువు పెంచడం జరిగిందని, అర్హులైన అభ్యర్థులు 2025 ఏప్రిల్ 14 లోగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ పథకం ద్వారా బిసి, ఎస్సీ, ఎస్టి, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వ యం ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ ప్రభు త్వం హయంలో కల్పిస్తుందన్నారు. ఒక రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబంలో ఒకరికి మాత్రమే దరఖాస్తు చేసే అర్హత ఉం టుందని, ఇట్టి పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.