calender_icon.png 17 April, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ యువ శక్తి స్కీమును సద్వినియోగం చేసుకోవాలి

08-04-2025 10:23:01 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ శక్తి స్కీమును మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఓ రమేష్ దీన్ దయాల్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ లో దరఖాస్తులు సమర్పిస్తున్న యువకులు నేటి వరకు 220 దరఖాస్తులు సమర్పించి ఉన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి కల్పనకు దరఖాస్తులు చివరి తేదీ ఏప్రిల్ 14, వరకు స్వీకరించడం జరుగును. కావున ఇట్టి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ తెలియజేశారు.