09-03-2025 06:10:31 PM
కలెక్టర్ వెంకటేష్ దోత్రే...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికల నేపథ్యంలో నిలిపివేయబడిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 10వ తేదీ(సోమవారం) నుండి నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఈ నెల 8వ తేదీన ముగియడంతో ప్రజావాణి కార్యక్రమాన్ని యధాతథంగా నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.