calender_icon.png 18 April, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

09-04-2025 10:55:41 PM

నిరుద్యోగ యువతకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపు..

కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ద్యేయంగా మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, జాబ్ మేళా నిర్వహించే టాస్క్ కంపెనీ ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,  ఎస్పీ కిరణ్ ఖరే తో కలిసి ఈ నెల 26న నిర్వహించే మెగా జాబ్ మేళా కార్యక్రమ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో టాస్క్ కంపెనీ నిర్వహిస్తున్న జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు.

700 కంపెనీలు పాల్గొంటున్న ఈ జాబ్ మేళాలో 10 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీన నిర్వహించే జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఈ జాబ్ మేళా కార్యక్రమంపై గ్రామ గ్రామాన విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈనెల 26వ తేదీన జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే జాబ్ మేళాకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హాజరవుతారని తెలిపారు.  క్యూ ఆర్ కోడ్ లో దరఖాస్తు ఉంటుందని విద్యార్హతలు ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు.  క్యూ ఆర్ కోడ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకొని వారు 26వ తేదీన నిర్బహించే జాబ్ మేళా స్టాళ్లులో నమోదు చేసుకోవాలని తెలిపారు.

10 వతరగతి నుండి డిగ్రీలు, పిజీలు ఇతర పై చదువులు చదువుకున్న నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశమని అన్నారు. మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులు, పోలీస్ శాఖ సమన్వయంతో అవగాహన కల్పించాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. మందులు, ఓఆర్ఎస్  అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కేటీపీఎస్ సీఈ శ్రీ ప్రకాష్, సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు, టాస్క్ ప్రతినిధి ప్రదీప్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.