23-04-2025 06:50:51 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో మొత్తం ఇప్పటివరకు 6277 మంది ఎల్ఆర్ఎస్(LRS scheme) దరఖాస్తుదారులు క్రమబద్దీకరణకు రుసుము చెల్లించారని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బుధవారం తెలిపారు. జిల్లాలో 44 వేల 602 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయని, ఇందులో ఆమోదం పొందిన దరఖాస్తుదారులు 6277 మంది రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లించి తమ దరఖాస్తులను క్రమబద్ధీకరించుకున్నారని తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో రుసుములు చెల్లించినవారిలో ఐదుగురిని ఎంపికచేసి సంబంధిత అధికారులతో కలిసి రేపు మధ్యాహ్నం 3 గంటలకి కలెక్టరేట్ లో సన్మానించాలని నిర్ణయించామని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.