calender_icon.png 6 February, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిసాన్ అగ్రి షో-2025 ని సద్వినియోగం చేసుకోవాలి

06-02-2025 06:22:40 PM

చెన్నూరు ఏడీఏ బానోత్ ప్రసాద్..

మందమర్రి (విజయక్రాంతి): మండలంలోని రైతులు ఈనెల 7 8 9 తేదీలలో హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహించనున్న కిసాన్ అగ్రి షో-2025 సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ చెన్నూరు ఎడిఏ బానోత్ ప్రసాద్ కోరారు. గురువారం మండలంలోని పులిమడుగు గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు అగ్రి షోని సందర్శించి వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను, ప్రదర్శనలో వీక్షించడం ద్వారా అవగాహన కలుగుతుందన్నారు.

వ్యవసాయ ప్రదర్శనలను సందర్శించడం ద్వారా వ్యవసాయం, అనుబంధ రంగాలలో జరుగుతున్న అభివృద్ధిని తెలుసుకోవచ్చని, నూతన వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనతో పాటు విత్తనాలు, పురుగు మందులు తదితరాలు వాటిలో నూతన ఆవిష్కరణలు తెలుసుకోవచ్చని అన్నారు. ఈ ప్రదర్శనకు రైతులు స్వంత ఖర్చులతోనే వెళ్లాలని సూచించారు. అంతే కాకుండా మండలంలో నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ముత్యం తిరుపతి, కనకరాజులు పాల్గొన్నారు.