calender_icon.png 23 April, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

23-04-2025 12:59:57 AM

భూపాలపల్లి డీఎస్పీ ఏ. సంపత్ రావు

కాటారం (భూపాలపల్లి),  ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్విని చేసుకోవాలని భూపాలపల్లి డి.ఎస్.పి ఏ. సంపత్ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో టాస్క్  సంస్థ నిర్వహిస్తున్న జాబ్ మేళా లో పలు  ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు.   విద్యార్హతల ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలిపారు.

క్యూ ఆర్ కోడ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోని వారు 27వ తేదీన నిర్బహించే జాబ్ మేళా శిబిరం లో నమోదు చేసుకోవాలని తెలిపారు. భూపాలపల్లి సబ్ డివిజన్ పరిధిలోని నిరుద్యోగ యువతి,  యువకులు జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు.