11-04-2025 12:00:00 AM
మంత్రి కొండా సురేఖ
హనుమకొండ, ఏప్రిల్ 10 (విజయ్ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా తాను ప్రత్యేక చొరవ తీసుకొని ఏప్రిల్ 11న వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు టాస్క్ వారి సౌజన్యంతో జాబ్ మేళా శుక్రవారం రోజున వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వరంగల్ జిల్లా యువతీ యువకులందరూ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని, తమ పేర్లను నమోదు చేసుకొని, నిర్వాహకులు విడుదల చేసిన పోస్టరులో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు ఎన్ రోల్ చేసుకోని శుక్రవారం ఉదయం 9:30 గంటల నుండి వరంగల్ లోని ఎంకే నాయుడు హోటల్స్, కన్వెన్షన్ లో ప్రారంభం అవుతుందని ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాబ్ మేళా నిర్వహిస్తున్న టాస్క్ యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు