calender_icon.png 27 December, 2024 | 12:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిమ్ ని సద్వినియోగం చేసుకోవాలి

25-12-2024 12:00:00 AM

కోరుట్ల, డిసెంబర్ 24 : ప్రతి ఒక్కరూ ఓపెన్ జిమ్‌ను సద్వినియోగం చేసుకోవా లని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మంగళవారం కోరుట్ల మండలంలోని అయి లాపూర్ గ్రామంలో బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు  రూ.5 లక్షల నిధుల తో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్’ను ఎమ్మెల్యే సంజయ్ ప్రారంభించారు. అలాగే కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణం, మండలా నికి సంబంధించిన రూ.15,64,500 లు  56 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, కోరుట్ కు చెందిన టూబ మహిన్’కు  రూ.60,000 లు, సంగెం  గ్రామానికి చెందిన వి.మల్లేశం కు రూ. 2,00,000, తిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన ఏ.నర్సుకు రూ. 1,15,0 00 ఎల్‌ఓసి చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తోట నారాయణ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్, చీటి వెంకట్రావ్, సుధవేణి భూమయ్య, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.