17-03-2025 01:06:41 AM
అమీన్‌పూర్ కమిషనర్ జ్యోతిరెడ్డి
పటాన్ చెరు, మార్చి 16 : ప్రభుత్వం కల్పించిన ఇరవై ఐదు శాతం రాయితీని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని అమీన్ పూర్ మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి కోరారు. ఆదివారం ఆమె మున్సిపల్ కార్యాలయంలో విజయ క్రాంతి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. 2020లో అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఎనిమిది వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపులకు ప్రభుత్వం ఇరవై ఐదు శాతం రాయితీ కల్పించినప్పటి నుంచి ఇప్పటివరకు 350 దరఖాస్తుదారులు చెల్లింపులు చేశారని తెలిపారు.
వీటి ద్వారా రూ.3 కోట్లు వచ్చాయన్నారు. ఈనెల 31 వరకు రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపులు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. మిగిలిన 15 రోజుల్లో దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపులు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులకు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ద్వారా ఫోన్ మెసేజ్ లతో పాటు నేరుగా ఫోన్ చేసి చెబుతున్నట్లు చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్ చెల్లింపుల కోసం కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. ఆదివారం ఒకేరోజు 54 మంది ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి పవన్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.