10-02-2025 07:20:50 PM
ప్రిన్సిపల్ డాక్టర్ వంగ చక్రపాణి..
మంచిర్యాల (విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెల రోజుల సర్టిఫికేట్ కోర్సును కామర్స్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వంగా చక్రపాణి కోరారు. సోమవారం 'సర్టిఫికెట్ కోర్సు ఇన్ టాలీ'ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. బీకాం మొదటి, రెండవ సంవత్సరం విద్యార్దులకు ఈ కోర్సును ఉచితంగా నేర్పిస్తున్నామని, 30 రోజుల తర్వాత పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణులైన విద్యార్దులకు సర్టిఫికెట్ ఇవ్వనున్నామన్నారు. ఈ సర్టిఫికెట్ కోర్సు విద్యార్థుల ఉపాది అవకాశాలు పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కామర్స్ విభాగం అధ్యాపకులు నరేందర్ రెడ్డి, మదు సుధన్, మంజుల, ఇతర అధ్యాపకులు హరీష్, గోపాల కృష్ణ, గంగయ్య, రాజయ్య, రసూల్, విద్యార్దులు పాల్గొన్నారు.