calender_icon.png 10 January, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"ఆరోగ్య మహిళ" క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి

09-01-2025 07:28:47 PM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి...

కరీంనగర్ (విజయక్రాంతి): వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్న ఆరోగ్య మహిళ క్యాంపును సద్వినియోగం చేసుకొని ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(Collector Pamela Satpathy) సూచించారు. తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట గ్రామ పంచాయితీ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ క్యాంపును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. క్యాంపు నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించి రిజిస్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడుతూ.. 45 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రతి మహిళ ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. గ్రామంలోని ప్రతి మహిళకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు జరగాలని, ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఈ ఉచిత వైద్య పరీక్షలు చేసుకోవాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ క్యాంపులు నిర్వహించి ఆరోగ్య మహిళా పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వారిని గుర్తించి అవసరాన్ని బట్టి  ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఎంపీడీఓ విజయ్ కుమార్, కోఆర్డినేటర్ సనా, కార్యదర్శి శ్రీధర్ పాల్గొన్నారు.