ఆదిలాబాద్ (విజయక్రాంతి): అగ్నివీర్ వాయు పథకంను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. యువతకు ఇదొక మంచి అవకాశమని, అగ్నివీర్ వాయు పథకంను ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆన్నారు. నేటి నుంచి జనవరి 27వ తేదీ వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనీ, ఆన్ లైన్ పరీక్ష మార్చి 22న ఉంటుందని తెలిపారు. 01 జనవరి 2005, 01 జూలై 2008 మధ్య కాలంలో జన్మించిన అర్హత గల అవివాహిత, స్త్రీ, పురుష అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైనిక సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, మాజీ సైనికులు సంఘం అధ్యక్షులు శంకర్ దాస్, ఆగ్నివీర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు, మాజీ సైనికులు తదితరులు ఉన్నారు.