07-03-2025 12:00:00 AM
బ్యాంక్ మేనేజర్ కిశోర్‌కుమార్
జహీరాబాద్, మార్చి 6 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పస్సాపూర్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కిషోర్ కుమార్ తెలిపారు. ప్రజలకు బ్యాంకు ద్వారా అనేక రకాలైన సేవలను అందిస్తున్నారు .ఈ బ్యాంకు ప్రభుత్వ రంగ సంస్థ అయినందున దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ బ్యాంకులో వ్యవసాయదారులకు అధిక ప్రాణిస ఇచ్చి పంట రుణాలను అందజేస్తున్నామని ఆయన తెలిపారు.
దీంతో పాటు బంగారంపై కూడా రుణాలు అందజేస్తున్నామని ఆయన వివరించారు. బ్యాంకు సేవలను అన్ని వర్గాల ప్రజలకు అందించేందుకు తమ బ్యాంకు కృషి చేస్తుందని అన్నారు. వాహనాల కొనుగోలు ఇల్ల నిర్మాణాలు వ్యాపారం చేసుకునే వారికి రుణాలు మంజూరు చేస్తున్నట్లు ఆయన వివరించారు. బ్యాంకు సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.