కోదాడ,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని బృందావన్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ సెంటర్ నిర్వాహకులు మురళీకృష్ణ పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకాన్ని అర్హత గల వారు అప్లై చేసుకునే, చేసుకున్న వాళ్లు ట్రైనింగ్ సెంటర్లు సంప్రదించాలని తెలిపారు. ప్రస్తుతం ట్రైనింగ్ సెంటర్లు స్టార్ట్ అయినయని ట్రైనింగ్ సెంటర్ ను కోర్టు ఎదురుగా భవనంలో ఏర్పాటు చేశామన్నారు అదేవిధంగా స్నేహిత ఉమెన్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ మాతంగి శైలజ పాల్గొని మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాన్ని తెలంగాణ మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 868886494 నెంబరులో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో రేణుక జి సతీష్ స్రవంతి తదితర ట్రైనింగ్ నిర్వాహకులు పాల్గొన్నారు