calender_icon.png 3 April, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి

27-03-2025 11:44:42 PM

ఈనెల 31లోపు ఆస్తి పన్ను చెల్లిస్తే వడ్డీపై 90 శాతం రాయితీ..

జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి...

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ కల్పించిన వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్)ను సద్వినియోగం చేసుకోవాలని, గడువు మరో నాలుగు రోజులే ఉందని కమిషనర్ ఇలంబర్తి సూచించారు. ఈనెల 31 లోపు ఆస్తి పన్ను చెల్లించి వడ్డీపై 90 శాతం రాయితీ పొందొచ్చని గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్, సిటిజన్ సర్వీస్ సెంటర్లు, ఈ సేవా కేంద్రాల ద్వారా ఆస్తి పన్ను చెల్లించవచ్చని పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ సర్కిల్, హెడ్ ఆఫీస్‌లో ఉన్నటువంటి సిటజన్ సర్వీస్ సెంటర్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పని చేస్తాయని ఆయన తెలిపారు. ఇళ్లలోకి వచ్చే బిల్ కలెక్టర్లకు కూడా నేరుగా ఆస్తి పన్ను చెల్లించి రాయితీతో కూడిన రశీదులను పొందొచ్చన్నారు. మైజీహెచ్‌ఎంసీ, ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా కూడా ఆస్తి పన్ను చెల్లించే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. పన్ను చెల్లించినవారు నగరాభివృద్ధికి దోహదపడిన వారవుతారన్నారు.