calender_icon.png 6 March, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశాలను సద్వినియోగం చేసుకోండి

06-03-2025 12:31:13 AM

మహబూబ్ నగర్, మార్చి 5 (విజయ క్రాంతి) : అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని మీ కుటుంబాలకు భరోసా అందించాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రధాన మంత్రి  ఉపాధి కల్పన పథకం , ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం,  ప్రధాన మంత్రి  సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారి  సంస్థల  క్రమబద్ధీకరణ పథకాలు పై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ  చిన్నచిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని వ్యాపారం ఆరంభిస్తే మునుముందు పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారని ఆకాంక్షించారు.

చేసే పని ఎప్పుడు చిన్నదిగా చూడకూడదని, ఉన్నత శిఖరాలకు అందించేందుకు చిరు వ్యాపారాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదలను ఉన్నత స్థాయికి తీసుకువచ్చేందుకు అనేక పథకాలను అమ లు చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వచ్చిన అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసు కొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల మేనేజర్లు, అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.