calender_icon.png 12 January, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

12-10-2024 01:50:43 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 

మహబూబ్‌నగర్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): వచ్చిన అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జయప్రకాష్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వన్ విండో ఇన్ అబ్రాడ్ ఫెయిర్ 2.0’ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

విదేశాల్లో చదవాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశామని, బ్యాంక్ ద్వారా లోన్స్ కూడా పొందవచ్చని తెలిపారు. విదేశీ యూనివర్సిటీ ప్రతినిధులను మహబూబ్‌నగర్‌కు ఆహ్వానించి ఇక్కడి విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేందుకు కృషి చేస్తున్న జేపీఎన్‌సీఈ కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్‌ను అభినందించారు.

అంతకుముందు జయప్రకాష్‌నారాయణ జయంతిని పురష్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్, డైరెక్టర్ రామారావు, వన్ విండో ఎం.విజయ్, హర్షవర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్‌కుమార్, జోసెఫ్ పాల్గొన్నారు.