calender_icon.png 24 February, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

19-02-2025 06:12:59 PM

డిసిపిఓ బూర్ల మహేష్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఉపాధి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని బాలల సంరక్షణ జిల్లా అధికారి బూర్ల మహేష్ సూచించారు. జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ అకాడమి ఫర్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు జీవన నైపుణ్యాలు, క్రమశిక్షణ, ఆర్గనైజేషన్ బిహేవియర్ తదితర అంశాలపైన శిక్షణ ఇచ్చారు. జిల్లాలో పిల్లల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

శిక్షణ పొందుతున్న నిరుద్యోగ యువత కష్టపడి అంకితభావంతో శిక్షణను పూర్తిచేసుకుని ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అభ్యర్థులకు ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ పత్రాలను టాస్క్ మేనేజర్ సాయికుమార్ తో కలిసి అందజేశారు.