calender_icon.png 4 March, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోండి

04-03-2025 01:29:23 AM

 25శాంత రాయితీని పొందండి చివరి తేదీ ఈ నెల 31 వరకు 

అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 3 : ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ వేగవంతానికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకునే దరఖాస్తుదారులకు 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగానే  లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్క్పీ పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీందర్‌రెడ్డి, తన సిబ్బందికి తట్టిఅన్నారం వార్డు ఆఫీసులో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్. రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ... ఎల్‌ఆర్‌ఎస్‌ను పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల న్నారు.  ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకుంటే.. 25శాతం రాయితీ పొందవచ్చని అన్నారు. అలాగే  అనుమతి లేని లే అవుట్లలో 10శాతం రిజిస్ట్రేషన్ అయి..

మిగతా వాటిని కూడా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌తో పాటు ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై ఎలాంటి సందేహాలు ఉన్న పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో సంప్రదించగలరన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.