04-03-2025 07:30:44 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో మహిళా సంఘాలకు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు బ్యాంకుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. మంగళవారం నిర్మల్ మండలంలోని చిట్యాల గ్రామంలో ఎస్బిహెచ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు 64 లక్షల రుణాలను అందజేశారు. పొదుపు సంఘాలకు బ్యాంకులు తక్కువ వాడికి రుణాలు అందిస్తాయని వాటిని తిరిగి చెల్లించి ఎక్కువ రుణాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.