నిర్మల్,(విజయక్రాంతి): నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 30న నిర్మల్ జిల్లా కేంద్రంలో జాబ్ మేళా(Job Fair) నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilasha Abhinav) తెలిపారు. ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్నీషియన్ సిబ్బందితోపాటు మిషనరీ సిబ్బంది ఉద్యోగాలు కలవని తెలిపారు. పదివేల వేతనం ఉచిత భోజనం వసతి సౌకర్యాలు ఉంటాయని దీన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చూసుకోవాలని కోరారు. నిర్మల్ డిగ్రీ కళాశాల(Nirmal Degree College)లో ఈనెల 30న ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు.