calender_icon.png 2 April, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

01-04-2025 04:43:29 PM

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..

ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు అందిస్తున్న, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలోని దుకాణం 1లో లబ్ధిదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాల ఫలాలు పూర్తిస్థాయిలో అందించడమే లక్ష్యంగా పని చేస్తుందని అన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజలకు సన్న బియ్యం పథకం శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, అంకం రాజేందర్, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లు పడిగల భూషణ్, మజీద్, నాయకులు నయీమ్, తాసిల్దార్ సుజాత రెడ్డి తదితరులు ఉన్నారు.