30-04-2025 12:04:21 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కడ్తాల్ లో కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ
కడ్తాల్, ఏప్రిల్ 29 : ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు. కడ్తాల్ మండల కేంద్రంలో పలువురు లబ్ధిదారులకు మంగళవారం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణి నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి హాజరై లబ్ధిదారులకు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ యాట గీత నర్సింహా, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, అర్బన్ డవలప్ మెంట్ చైర్మన్ నర్సింహా రెడ్డి, పోలిషన్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, తహశీల్ధార్ ముంతాజ్ బేగం, ఎంపిడిఓ సుజాత, స్థానిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బీక్యా నాయక్, బీచ్యా నాయక్, వెంకటేష్, నరేష్ నాయక్, బాల్ రాజ్, అశోక్, రాములు తదితరులు పాల్గొన్నారు.