04-04-2025 06:39:58 PM
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, భిక్కనూర్, పాల్వంచ, దోమకొండ, బిబిపేట మండలాలలోని కళ్యాణ లక్ష్మి సిఎంఆర్ఎఫ్ షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఈ ఆర్థిక స్తోమత ఎంతో అండగా ఉంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పల్వంచ మండల కేంద్రంలోని రైతు వేదికలో 13 మంది లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మాచారెడ్డి మండల కేంద్రంలో ని రైతు వేదికల 46 మంది లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రామారెడ్డి, కామారెడ్డి, బిక్కనూర్, రాజంపేట బిబిపేట్ దోమకొండ మండలాల్లోని ఆయా గ్రామాల్లోని లబ్ధిదారులకు సీఎంఆర్ ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.