సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, జనవరి 21 (విజయ క్రాంతి): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తుందని, లబ్దిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తులతో పాటు ఇప్పుడు జరిగే గ్రామ సభలలో ఇచ్చిన దరఖాస్తులు, ఈ గ్రామ సభలలో హాజరుకు వీలుకాకపోయినా సంభందిత అధికారులకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు అన్నిటినీ పరిశీలించి అర్హులందరికీ పథకాలు అందేలా ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందని అన్నారు.
ఎంపివో నర్సింహ రెడ్డి, గ్రామ స్పెషల్ ఆఫీసర్ అనూష, డిప్యూటీ తహశీల్దార్ సుమలత,ఆర్‌ఐ రజినీ కుమార్, ఏఈవో రాజేంద్ర ప్రసాద్, కార్యదర్శి కన్యాకుమారి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్వామి గౌడ్, మాజీ ఎంపిటిసి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్, పర్షరాములు, శేఖర్, రవి, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, పాల్గొన్నారు.