జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని తాటియా గార్డెన్లో ఏర్పాటు చేసిన వేడుకలకు ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల వారికి ప్రాధాన్యతనిస్తూ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ విభాగాలలో వేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీఎస్సీ కానిస్టేబుల్ గ్రూప్-4 వివిధ నోటిఫికేషన్లలో నిరుద్యోగులు ఎంతోమంది తమ ప్రతిభ చాటి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారని గుర్తు చేశారు. వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డిసిసి విశ్వప్రసాద్, నాయకులు ఆత్రం సుగుణ శేషరావు తదితరులు పాల్గొన్నారు.