calender_icon.png 20 November, 2024 | 4:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

20-11-2024 03:05:56 PM

సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. బుధవారం దాహేగాం, పెంచికల్పేట్ మండలాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన వారు సంక్షేమ పథకాలు పొందాలని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు.

ప్రజల సంక్షేమానికి ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు అందేలా చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు కవిత, వెంకటేశ్వర్, ఎంపీడీఓ రాజేందర్, ఏవో మనీషా,సింగిల్ విండో చైర్మన్ కోండ్ర తిరుపతి గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ రాపర్తి ధనుంజయ్, ఆర్ఐ శృతి, ఎంసి రాథోడ్ ధన్ రాజ్, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు చప్పిడి సత్యనారాయణ, భాజపా మండల అధ్యక్షుడు జునగరి మధుకర్, ఘనపురం నాగేష్, మాజీ ఎంపీటీసీ దూగుంట రాజన్న, ఆర్ఐ సురేష్, కోండ్ర ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.