calender_icon.png 22 November, 2024 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలి

22-11-2024 03:30:07 PM

శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందించిన కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ (విజయక్రాంతి): యువజన సర్వీసుల శాఖ సెట్వీన్ ఆధ్వర్యంలో అదిలాబాద్ వృత్తి నైపుణ్యం కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు 3 నెలల పాటు అందించిన ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణా కేంద్రంలో టైలరింగ్, కంప్యూటర్, సీసీ కెమెరాలు, మొబైల్ రిపెరింగ్, కంప్యూటర్ శిక్షణ, రిప్రిజరేటర్, ఎయిర్ కండిషన్ లలో 3 నెలల కాల పరిమితులలో శుధిక్షుతులైన అభ్యర్థుల ద్వార శిక్షణా ఇవ్వడం జరిగిందని తెలిపారు. నిరుపేద యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీని ద్వారా లబ్ధి పొందాలని సూచించారు. ఈ కేంద్రంలో ఇప్పటి వరకు ఐటీడీఏ, ఉమెన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో స్పాన్సర్డ్ చేయబడిన విద్యార్ధులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి.వై.ఎన్ ఓ వెంకటేశ్వర్లు, డి.డబ్ల్యూ.ఓ సబిత, ప్రిన్సిపాల్ రవీందర్, వై.టి.సి ఇంఛార్జి బలిరాం, లలిత ఉన్నారు.