calender_icon.png 2 April, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

29-03-2025 01:01:40 AM

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష

రామగిరి, మార్చి  28 (విజయ క్రాంతి) : ఆర్మీ రిక్రూట్మెంట్ టెస్టులో ఉత్తీర్ణత సాధించేందుకు గాను పెద్దపెల్లి జిల్లా  అందిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ రాత పరీక్షకు ఆసక్తి గల అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు చేపట్టిన అభ్యర్థుల ఎంపిక కార్యక్రమాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ అగ్ని వీర్ ద్వారా ఇండియన్ ఆర్మీ లోకి రిక్రూట్మెంట్ కొరకై 2025- 26 సంవత్సరముకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో అర్హత, ఆసక్తి గల అభ్యర్థులకు రాత పరీక్ష,శరీర దారుఢ్యం కు సంబంధించిన శిక్షణను పూర్తి వసతితో  అందించేందుకు నిర్ణయించామని, జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ఆసక్తి గల 359 అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించామని , నేడు  240 మంది అభ్యర్థులు.

రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి స్టేడియం నకు చేరుకున్నారని, వీరికి రిటైర్డ్ ఆర్మీ జవాన్ల పర్యవేక్షణలో  రన్నింగ్  ఇతర ఫిజికల్ , మెడికల్ టెస్ట్ లు నిర్వహించామని, టెస్ట్  లలో అర్హత సాధించిన అభ్యర్థులకు పూర్తి స్థాయిలో రెండు మాసాల పాటు వ్రాత పరీక్ష,  శరీరం దారుఢ్యం.

సంబంధించిన శిక్షణను వసతి తో కూడా కలిపి ఎన్.టి.పి.సి  సహకారంతో పూర్తి స్థాయిలో ఉచితంగా అందిస్తున్నారని, ఉచిత శిక్షణను అభ్యర్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా యువజన& క్రీడా అధికారి సురేష్ ,రామగుండం ఏసిపి రమేష్ , మిలిటరీ జవాన్ మహిపాల్ రెడ్డి , ఇతర సిబ్బంది ,  తదితరులు పాల్గొన్నారు.