04-09-2024 02:27:55 AM
గద్వాల(వనపర్తి ), సెప్టెంబర్ 3(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్వీఎం డిగ్రీ కళాశాల సమీపంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు రుణ గ్రహీతలకు డిజిటల్ ఐడీ పీఎం విశ్వకర్మ డిజిటల్ సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.