calender_icon.png 10 January, 2025 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య మహిళను సద్వినియోగం చేసుకోవాలి

03-01-2025 01:10:40 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

మానకొండూర్, జనవరి 2: గ్రామైక్య సం ఘాల సభ్యులు ఆరోగ్య మహిళ కార్యక్ర మాన్ని సద్వినియోగం చేసుకొని ఉచిత వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలంలోని ముక్తపల్లి గ్రామ పంచాయితీ ఆవరణలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళ క్యాంపును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. క్యాంపు నిర్వహణ ఏర్పాట్ల ను పరిశీలించి రిజిస్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడుతూ 45 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నా మని తెలిపారు. . వ్యాధి నిర్ధారణ అయిన వారిని గుర్తించి వైద్య సహాయం అందించా లని తెలిపారు. ఈ క్యాంపులో జిల్లా కలెక్టర్ హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకున్నారు. 

అంగన్వాడీ కేంద్రం సందర్శన 

ముక్తపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆకస్మికంగా సందర్శించారు. పిల్లల హాజరు, నమోదు రిజిస్టరును పరిశీలించారు.  బోధిస్తున్న సిలబస్ గురించి అంగన్వాడీ టీచర్ ను అడిగారు. సరఫరా అవుతున్న పోషకాహారం పరిశీలించారు.

అంగన్వాడికి పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని సూచిం చారు. గృహ సందర్శనలు చేసి తల్లిదండ్రు లకు అంగన్వాడి సేవల గురించి అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీ, బాలింతలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించారు.   ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంక టరమణ, ఎంపీడీవో విజయ్ కుమార్, కోఆ ర్డినేటర్ సనా పాల్గొన్నారు.