calender_icon.png 27 December, 2024 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల వినతిపై చర్యలు తీసుకోండి

25-12-2024 01:36:23 AM

పవర్‌గ్రిడ్ బీదర్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తా మాదారం గ్రామంలోని సర్వే నంబర్ 35, 36, 37ల్లో విద్యుత్తు సరఫరా లైన్ల ఏర్పాటు గురించి రైతుల వినతిపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని పవర్‌గ్రిడ్ బీదర్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌ను హైకోర్టు ఆదేశించింది.

రైతులు వారంలోగా వినతి పత్రం సమర్పించాలని, దానిపై తగిన నిర్ణ యం తీసుకోవాలని సంస్థకు ఆదేశాలు జారీచేసింది. ట్రాన్స్‌మిషన్ లైన్ల ఏర్పాటుపై తాము డిసెంబరు 10న సమర్పించిన వినతి పత్రాన్ని ట్రాన్స్‌మిషన్ సంస్థ స్పందించకపోవడంతో జీ శ్రీనివాసులు తదితర రైతులు వేసిన పిటిషన్‌పై విచారించిన సింగిల్ జడ్జి కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రైతులకు తగి న పరిహారం చెల్లించి లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

దీన్ని సవాల్ చేస్తూ రైతు లు దాఖలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పవర్‌గ్రిడ్ బీదర్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ తరఫు న్యాయవాది వాద నలు వినిపిస్తూ.. రైతులు తాజాగా వినతి పత్రం సమర్పిస్తే చట్టప్రకారం తగిన నిర్ణ యం తీసుకుంటామని చెప్పారు.

దీన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వారం లోగా రైతులు వినతి పత్రాన్ని సమర్పించాలని, దీనిపై కేంద్రం మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. విద్యుత్తు లైన్ల ఏర్పాటుపై అభ్యంతరాలుంటే పవర్‌గ్రిడ్ బీదర్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్‌కు వివరించాలంటూ అప్పీలుపై విచారణను ముగించింది.