01-03-2025 12:04:37 AM
రంగారెడ్డి జిల్లా ఇంటర్మీయట్ విద్యాధికారి వెంక్యా నాయక్‌కు వినతి పత్రం
అబ్దుల్లాపూర్ మెట్, ఫిబ్రవరి 28: ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి వంశీవర్దన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏఐఎస్‌ఎఫ్ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యా సంస్థల ముందస్తు అడ్మిషన్లపై చర్యలు ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంక్యానాయక్‌కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సామిడి వంశీవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ...
రంగారెడ్డి జిల్లా వ్యాపితంగా నారాయణ, శ్రీ చైతన్య, శ్రీ వశిష్ట, క్షేత్ర, యువ కాలేజ్ కార్పొరేట్ విద్యాసంస్థులు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి (టీఎస్‌బీఐఈ) నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్నారన్నారు. పదోవ తరగతి పరీక్షలు పూర్తికాకముందే విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి స్టూడెంట్స్ అడ్మిషన్ల కోసం బలవంత పెడుతున్నారని అన్నారు.
ఈ వ్యవహారాన్ని అరికట్టి, నిబంధనలను పాటించని విద్యాసంస్థలపై కఠిమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రంగారెడ్డి జిల్లా గరల్స్ కన్వీనర్ కె. శ్రావణి, జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్ గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి చింత వెంకటేష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వి. శివ తదితరులు పాల్గొన్నారు.