28-04-2025 04:29:54 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సాగర్ కాలనీ 67 నెంబర్ సర్వే నెంబర్లు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను కొందరు ఆక్రమించుకొని కొత్త వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని బాధితులు సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. 1993లో అప్పటి అధికారులు రిటైర్మెంట్ ఉద్యోగులకు ప్లాట్లను కేటాయించిందని వాటిని కొందరు ఆక్రమించుకొని సరిహద్దులు ఏర్పాటు చేసుకుంటున్నారని దీనిపై కోర్టులో ఆశ్రయించగా కోర్టు విచారణ జరుగుతున్న ప్లాట్లను ఆక్రమించుకున్న వారిపై చర్య తీసుకోవాలని ఉద్యోగులు బాధితులు కలెక్టర్కు విన్నవించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటారని వారికి కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ నాగరాజు రాజు లక్ష్మి తదితరులు ఉన్నారు.