calender_icon.png 29 April, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివుని విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి

28-04-2025 01:17:24 AM

పటాన్ చెరు, ఏప్రిల్ 27 : జిన్నారంలోని శివాలయం గుట్టపై ఏర్పాటు చేసిన శివుని విగ్రహాన్ని 12 మంది మదర్సా విద్యార్థులు ధ్వంసం చేశారని వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిన్నారం, జంగంపేట, ఊట్ల తదితర గ్రామాలకు చెందిన హిందువులు జిన్నారం పోలీసులను కోరారు. ఈ మేరకు ఆదివారం పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

విగ్రహాన్ని కోతులు కింద పడేస్తే ముక్కలు ముక్కలుగా ఎలా అయ్యిందని, గుట్ట కింద సగం మంది విద్యార్థులు ఉండగా మరో సగం మంది విద్యార్థులు గుట్టపైకి ఎక్కి విగ్రహాన్ని ముక్కలు చేశారన్నారు. హిందువుల ఆరాధ్య దైవమైన శివాలయం గుట్టపైకి మదర్సా విద్యార్థులు ఎందుకొచ్చారు...వారికి ఏం పని అని వారు ప్రశ్నించారు.

సీసీ కెమెరాలకు కనబడకుండా విగ్రహం ముక్కలు కింద పడి ఉన్నాయని వారు తెలిపారు. ఈ విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని మదర్సా మౌళ్వి  ఎండీ ఇర్ఫాన్, మదర్సా విద్యార్థులపై కేసు నమోదు చేయాలని వారు జిన్నారం పోలీసులనుకోరారు.