calender_icon.png 3 April, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ సంపదను ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

03-04-2025 12:23:39 AM

రాష్ట్ర అటవీ శాఖకు కేంద్ర పర్యావరణ శాఖ లేఖ

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూముల్లో అటవీ సంపదను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖ బుధవారం రాష్ట్ర అటవీ శాఖను కోరింది. బీజేపీ తెలంగాణ ఎంపీలు మంగళవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు హెచ్‌సీయూ భూములను పరిరక్షించాలని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఫిర్యాదుపై కేంద్ర పర్యావరణ శాఖ అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్.సుందర్  స్పందించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలపై సమగ్ర నివేదికను అందించాలని లేఖలో కోరారు. హెచ్‌సీయూలో అటవీ భూమిని స్వాధీనం చేసుకునే విషయానికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.

వన్యప్రాణులు, సరస్సులకు, ప్రత్యేకమైన రాతి నిర్మాణాలకు నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ వార్తా కథనాలు వచ్చాయని.. దీనిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టులు, ట్రిబ్యునళ్ల ఇతర చట్టాలు లేదా ఆదేశాలను ఉల్లంఘించలేదని నిర్ధారించుకోవాలని సుందర్ పేర్కొన్నారు.