08-04-2025 12:09:16 AM
జిల్లా కలెక్టర్‌కు తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం ఫిర్యాదు
నిజామాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): జిల్లాలోని గ్రామాల్లో విడీసీ అగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. గ్రామ కమిటీలు చెప్పిన ప్రకారం నడుచుకోలేదని ఉగాది పర్వదినాన పూజ కార్యక్రమానికి వెళ్లిన ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళలను వీడిసి ఆదేశాల మేరకు ఆ ఆలయ పూజారి వారినీ పూజలను చేసుకొని ఇవ్వకుండా తిప్పి పంపేశాడు. దీంతో గ్రామంలో పరిస్థితి నెలకొంది.
గౌడ, గీత కార్మికుల కుటుంబాల పై గ్రామాభివృద్ధి కమిటీ ల దౌర్జన్యం, ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలనీ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ... గౌడ, గీత కార్మికులు తమ గీత వృత్తిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నారనీ.
తాటి చెట్టు ఎక్కి కిందికి దిగేంత వరకు క్షణక్షణం జీవన్మరణ సమస్యలతో ఇబ్బందులు ఒక పక్క ఉండగా.. ఎలాంటి చట్టబద్ధతలేని గ్రామాభివృద్ధి కమిటీ వీడీసీ లు వృత్తిదారులు, సామాన్య ప్రజల పైన కుల బహిష్కరణలు, గ్రామ బహిష్కరణలు విధిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని రోజురోజుకు వేరే ఆగడాల మితిమీరుతున్నాయని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఇచ్చిన వినతిపత్రంలో ఆయన కోరారు.
కలెక్టర్ వెంటనే కట్టిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు కోయడ నరసింహులు గౌడ్, సిదుకు శేఖర్ గౌడ్, శ్రీరామ్ గౌడ్, కిషన్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ కోయేడి నర్సింహులు గౌడ్ . తదితరులు జిల్లా కలెక్టర్ ని కలిసిన వారిలో ఉన్నారు.