calender_icon.png 18 March, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఎఫ్‌జేపై చర్యలు తీసుకోండి

18-03-2025 12:00:00 AM

  1. తులసీ గబ్బార్డ్‌ను కోరిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
  2. అమెరికా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యక్రమాలకు చేస్తున్నట్టు వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 17: అమెరికా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యక్ర మాలకు పాల్పడుతున్న ఖలిస్థానీ గ్రూపు ఎస్‌ఎఫ్‌జేపై చర్యలు తీసుకోవాలని అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. భారత్‌లో పర్యటిస్తున్న తులసీతో రాజ్‌నాథ్ సింగ్ సోమవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా గురుపర్వంత్ సింగ్ పన్నూన్ నాయకత్వంలో పని చేస్తున్న ఎస్‌ఎఫ్‌జే  చేపడుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చట్టవిరుద్ధమైన ఎస్‌ఎఫ్‌జేపై కఠిన చర్యలు తీసుకోవాలని తులసీని కోరారు.

గత ఏడాది నవంబర్‌లో పన్నూన్‌ను భారత అధికారితో కలిసి నిఖిల్ గుప్తా అనే యువకుడు హతమార్చేందకు ప్రయత్నించాడని అమె  ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. అయితే అప్పట్లో ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది.

ఈ క్రమంలో ఎస్‌ఎఫ్‌జేపై చర్యలు తీసుకోవాలని తులసీని రాజ్‌నాథ్‌సింగ్ కోరడం ప్రాధాన్యతను సంతరిం  ఇదిలా ఉంటే తులసీ గబ్బార్డ్‌తో సమావేశం కావడంపట్ల ఎక్స్ వేదికగా రాజ్‌నాథ్‌సింగ్ సంతోషం వ్యక్తం చేవారు. రక్షణ, సమాచార మార్పిడితోపాటు మరికొన్ని అంశాలపై సమావేశంలో చర్చించినట్టు పేర్కొన్నారు. భారత్ మధ్య బంధం మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చర్చలు జరిగినట్టు రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు.