24-03-2025 09:10:02 PM
రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి డిమాండ్..
అందోల్: పుల్కల్ మండల్ గోంగ్లోర్ గ్రామనికి చెందిన జోగిపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె సంజీవయ్య, వారి కుమారుడు కిరణ్ పై ప్రముఖ సినీ నిర్మాత మురళీకృష్ణ దాడి చేయించడం చాలా బాధాకరం, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం బిక్షపతి పోలీసులను డిమాండ్ చేశారు. సోమవారం నాడు బాధిత కుటుంబాన్ని పరామర్శించి బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని వారికి మనోదైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పుల్కల్ మండల్ నాయకులు వీరిశెట్టి, అశోక్, నగేష్ గౌడ్, అర్షద్, బ్రహ్మానందరెడ్డి, జయపాల్ నాయక్, పలువురు పాల్గొన్నారు.