10-03-2025 05:45:15 PM
నోటీసులు ఇచ్చిన స్పందించని యాజమాన్యం..
అక్రమ కమాన్ పై చర్యలకు కమీషనర్ వెనుకడుగు..
అధికారపార్టీ నాయకుల అండతో యాజమాన్యం ఇష్టారాజ్యం..
మేడిపల్లి (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మీరాకిల్ హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని రోడ్డుపై అక్రమంగా నిర్మించిన కమాన్ తొలగించాలని పీర్జాదిగూడ స్పెషల్ ఆఫీసర్ కు ఏం.సి.పీఐ మండల కార్యదర్శి ముడి మార్టిన్ ప్రజావాణిలో పిర్యాదు చేశారు.
నగర పరిధిలో మీరాకిల్ హాస్పిటల్ కు సంబంధించి ఏవిధమైన అనుమతులు లేకుండా ప్రధాన రహదారిపై కమాన్ నిర్మించారని ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని గతంలో కమిషనర్ కు ఫిర్యాదు చేయగా హాస్పిటల్ యాజమాన్యంకి రెండు నోటీసులు ఇచ్చిన యాజమాన్యం స్పందించకపోవడంతో 3 నెలలుగా కమిషనర్ కాలయాపన చేస్తున్నారని, అదే విధంగా కమాన్ కు అక్రమంగా విద్యుత్ మీటర్ అమర్చి లైటింగ్ ఇవ్వగా ప్రజల తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యుత్ ఏ.ఈ కి పిర్యాదు చేయగా గతంలోనే విద్యుత్ మీటర్ తొలగించరాని కానీ అక్రమ కనెక్షన్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా మీరాకిల్ హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని కమాన్ నిర్మాణాన్ని తొలగించాలని మార్టిన్ కోరారు.