calender_icon.png 23 January, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లారెడ్డి వర్సిటీపై చర్యలు తీసుకోండి

05-07-2024 12:31:02 AM

ఉన్నత విద్యాశాఖకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ఎలాంటి అనుమతుల్లేకుండా మల్లారెడ్డి యూనివర్సిటీ బాలానగర్‌లో ఏర్పాటు చేసిన ఆఫ్ క్యాంపస్‌పై యూజీసీ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ బాలానగర్‌లో ఆఫ్ క్యాంపస్ కేంద్రం ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ నవీన ఎడ్యుకేషనల్ సొసైటీతోపాటు పలువురు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇటీవల జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీల అనుమతుల్లేకుండా ఆఫ్ క్యాంపస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందన్నారు.

ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 25న కోర్టు జారీ చేసిన నోటీసులను అందజేస్తే మల్లారెడ్డి యూనివర్సిటీతోపాటు, దానికి చెందిన ఆఫ్ క్యాంపస్ కేంద్రాన్ని కూడా తిరస్కరించాయన్నారు. ఆ కేంద్రంలో అడ్మిషన్లు చేపడుతున్నారని, వాటిని అడ్డుకునేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి ఆఫ్ క్యాంపస్ కేంద్రం ఏర్పాటుకు యూజీసీ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు అవసరమన్నారు. నోటీసు జారీ చేసినప్పటికీ మల్లారెడ్డి వర్సిటీ తరఫున ఎవరూ హాజరుకాలేదని, అందువల్ల చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.