calender_icon.png 26 October, 2024 | 12:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి

05-08-2024 01:57:48 AM

పోలీసులను ఆదేశించిన మంత్రి పొంగులేటి

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 4(విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతుల భూములను కబ్జా చేసే ఎంతటివారైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదివా రం ఖమ్మం జిల్లా కూసుమంచి క్యాంపు కార్యాలయంలో ఖమ్మం సీపీ సునీల్‌దత్‌తో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భం గా కూసుమంచి రైతుల భూములు ఆక్రమించుకుని, వారి ఆత్మహత్యలకు కారణమవు తున్న కబ్జాదారులను అరెస్టు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా శాంతి భద్రతలకు సంబంధించిన పలు ఆంశాలపై  చర్చించా రు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గంజాయి విక్రయాలు, వాడకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. గం జాయి కారణంగా యువత పెడదోవ పడుతున్నదని, గంజాయిని అంతమొందించేంద కు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పోలీస్ స్టేసన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలవ్వాలని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.