మలక్‌పేట పీఎస్‌లో ఎమ్మార్పీఎస్ నేతల ఫిర్యాదు
మలక్‌పేట, జనవరి 3: అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2023 ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేవేళ్ల డిక్లరేషన్‌ను ప్రకటించి, అధికారంలోకి వచ్చిన ఏడాది గడిచినా దానిని అమలు చేయకుండా మో చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ఖర్గేపై ఎమ్మార్పీఎస్ నాయకులు మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు.
మలక్‌పేట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పిడమర్తి నరేష్‌కు ఎమ్మార్పీఎస్ (కేఎస్ బాబువర్గం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిని ఎల్లేశ్ మాదిగ ఫిర్యాదు అందజేశారు. అనంతరం ఎల్లేశ్.. మాట్లాడుతూ.. చేవెళ్ల డిక్లరేషన్‌లో.. మాల, మాదిగ, ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని, అంబేద్కర్ అభయ హస్తం కింద రూ.12 లక్షలు అందజేస్తాం అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ వార్తలను, డిక్లరేషన్ కాపీని ఫిర్యాదుకు జత చేశారు.